ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నా

ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి తన వ్యక్తిగత విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని వెల్లడించారు.”నేను ప్రేమలో లేని రోజంటూ లేదు. నా జీవితంలో ప్రేమ విషయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. కానీ వాటి నుంచి వెంటనే బయటపడిపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం నేను డేటింగ్ గురించి ఆలోచించడం లేదు. నాకు స్ఫూర్తిగా నిలిచే ఓ వ్యక్తి తోడు కావాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్ల వయసులో నాకు రిలేషన్షిప్ పట్ల విభిన్నమైన అలోచనలు ఉండేవి. ఇప్పుడు నేను ఒకరి కోసం పాకులాడదలచుకోలేదు” అని అన్నారు కంగన.
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంతో మంచి విజయం అందుకున్న కంగన.. ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా నటిస్తున్నారు.
