బిగ్ షాక్.. లియో అట్టర్ ప్లాప్ !?

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన సినిమా ‘లియో’. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిక్సిడ్ టాక్ వినబడుతుంది. లియో బ్లాక్ బస్టర్ హిట్ అని ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తుంటే.. లియో డిజాస్టర్ అంటూ మరో వర్గం ట్రెండ్ చేస్తుంది. దీంతో సినిమా చూడాలనుకుంటున్న అభిమానులు కన్ఫూజన్ లో పడిపోయారు.

అసలు వాస్తవం ఏంటంటే ? లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత చిత్రాల రేంజ్ లో లేదు. ఆ విషయం ట్రైలర్ తోనే అర్థమయింది. ట్రైలర్ లో లోకేష్ మార్క్ ఎక్కడా కనిపించలేదని అప్పుడే అభిమానులు పెదవి విరిచారు. సినిమాలోనూ అదే జరిగింది. ఖైదీ, విక్రమ్ సినిమాల్లో కనిపించిన మెరుపులు, ట్విస్టులు ఇందులో కరువయ్యాయి. కానీ విజయ్ మార్క్ యాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.  LCU లొకేషన్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.

కథని ప్రజెంట్ చేయడంలో లోకేష్ కనగరాజ్ మాస్టర్. అయితే లియో విషయంలో మాస్టర్ ఫెయిల్ అయ్యారు. లియో కథ పడుతూ.. లేస్తూ ముందుకు సాగుతుంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయినా.. తెరపై విజయ్ గర్జిస్తున్న ప్రేక్షకుడు పెద్దగా కనెక్ట్ కాడు. ఎందుకంటే.. గ్రిప్పింగ్ మిస్సయింది. దీంతో లియో డిజాస్టర్ అని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. మరోవైపు పైరసీ ఈ సినిమా కొంపముంచింది. ఇప్పటికే ఈ సినిమా హెచ్ డీ వెర్షన్ కొన్ని పైరసీ సైట్లలో దర్శమిస్తుండటం దారుణం. ఓ వైపు మిక్సిడ్ టాక్.. మరోవైపు సినిమా లీక్ అవ్వడం లియోకు భారీ దెబ్బ అని చెప్పాలి.