‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ షోస్, మార్నింగ్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా టాక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే అన్ని వైపుల నుంచి  ‘భగవంత్ కేసరి’ పై పాజిటివ్ టాక్ వినబడుతుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి నుండి వచ్చిన సరికొత్త వర్షన్ అని కితాబిస్తున్నారు. ఎక్స్ లెంట్ మూవీ. తెలంగాణ యాసలో బాలయ్య ఇరగదీశారు. యంగ్ బ్యూటీ శ్రీలీల నటనకు ఫిదా అయినట్లు చెబుతున్నారు. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అద్భుతంగా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రిలీజ్ ముందు నుంచి దర్శకుడు చెబుతున్నట్లు.. ఈ సినిమా చానా ఏండ్లు గుర్తుంటుందని ట్వీట్ చేస్తున్నారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి మేజిక్ చేశాడు. బీజీఎం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. బాలయ్య సినిమాలంటే యాక్షన్ ప్రియులకు పండగే. అయితే భగవంత్ కేసరిలో యాక్షన్ తో పాటు అదిరిపోయే డైలాగులు ఉన్నాయి. దాంతోపాటు  కట్టిపడేసే ఎమోషన్స్ సన్నివేశాలతో సినిమాను రక్తికట్టించారు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.