సారీలో సూపర్ ఫిట్.. పటానీ అందాలకు ఫిదా !

వేదిక ఏదైనా తన మార్క్ చాటుకుంటోంది దిశా పటానీ. తాజాగా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చతుర్థి ఉత్సవాలకు సంప్రదాయ చీరకట్టులో హాజరైంది. అయితే సారీలో పటానీ అందాలు ఇంకా హైలెట్ గా కనిపించాయి. సారీ దిశ సూపర్ ఫిట్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముద్దుగుమ్మ చీరకట్టు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

వాస్తవానికి బికినీ లకు కేరాఫ్ అడ్రస్ గా దిశా పటానీ కనబడుతుంది. రకరకాల బికినీలతో సముద్ర ఓడ్డున రచ్చ చేయడం ఈ బ్యూటీకి అలవాటు. వాటితో నాన్ స్టాప్ గా అభిమానులను అలరిస్తుంటుంది. పటానీ కొత్త ఫోటోలకు బానిసైన ప్రత్యేక ఫ్యాన్స్ వర్గం ఉందంటే నమ్మశక్యం కాదేమో ! అంతలా తన అందాలకు దాసోహం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈ హాట్ బ్యూటీ ట్విట్టర్ ఖాతాలో 8 మిలియన్, ఇన్ స్టా ఖాతాలో 59.3 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఈ రేంజ్ లో ఫాలోయింగ్ కలిగిన మరో బాలీవుడ్ కథానాయిక లేదు మరీ !

ఇక సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘ఏక్ విలన్ రిటర్న్స్’ తో సందడి చేసింది దిశా. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తోంది. యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. అంతేకాదు.. ఈ మధ్య దిశా పటానీ మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

#DishaPatani look gorgeous at the Ambani’s #GaneshChaturthi celebrations. pic.twitter.com/g7ayaHlMAA— OTTRelease (@ott_release) September 21, 2023