ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. ఓ నెటిజన్ డౌటుఅనుమానం.. డైరెక్టర్ కౌంటర్ !

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తెరకెక్కుతోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. అంతేకాదు.. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తోంది. ఈ సప్రైజింగ్ న్యూస్ మీద ఓ నెటిజన్ వ్యంగంగా ట్వీట్ చేశారు. “ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూట్‌ అప్పుడే 50 శాతం పూర్తి చేశావు అంట కదా అన్నా. ఇక, క్వాలిటీ సంగతి దేవుడిపైనే వేశాం’’ అంటూ రాసుకొచ్చారు.

దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ సుతిమెత్తగా ఇచ్చేశాడు. “అంతేకదా తమ్ముడు అంతకుమించి నువ్వేం చేయగలవు చెప్పు..? ఈలోగా కాస్త కెరీర్‌, జాబ్‌, చదువు మీద ఫోకస్‌ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్‌ ది బెస్ట్‌’’ అని కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.