ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ

‘దొరసాని’గా తెరకు పరిచయం కాబోతుంది నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు కూడా ఇదే తొలి చిత్రం. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 12న సినిమా విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో శివాత్మిక మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాలని పంచుకొన్నారు. ‘బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకు పెద్ద అభిమానిని. నేను అలాంటి కథ ‘దొరసాని’తోనే నటిగా పరిచయం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రేమకథలో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. చాలా ఇష్టపడి నటించా. ‘నంది.

ఇక సినిమాల్లో తనకు మాటలు తక్కువ. కళ్లతోనే నటించేశా. తదుపరి సినిమా ఇంకా ఓకే చేయలేదు. దొరసాని రిజల్ట్ తర్వాత రెండో సినిమా కోసం కథని ఎంపిక చేసుకొంటానంది. నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువని నాన్నపై ప్రేమని చూపించింది శివాత్మిక.
