ఆమె బట్టలు విప్పేసి.. బర్త్ డే సెలబ్రేషన్స్ !

‘మనమందరం పుట్టేటప్పుడు డ్రెస్ తోనా పుడుతున్నాం. లేదు. సో.. మనం డ్రెస్ మొత్తం విప్పేసి.. మన బాడీయే అసలైన బర్త్ డ్రెస్’ అంటోంది అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా తీసుకొస్తున్నారు. రత్న కుమార్ దర్శకత్వం వహించారు. లైంగికల్ వేధింపులు, రేప్ కేసు నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

సినిమాలో అమలా పాత్ర తీరుని తెలియజేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ఆమె అగ్రెసివ్ బిహేవియర్, క్రేజీ థాట్స్ కలిగిన డేరింగ్ అమ్మాయిగా కనిపిస్తోంది. ఛాలెంజ్ లు చేయడం, వాటి కోసం రిస్క్ చేయడం.. ఈ క్రమంలో సమస్యల్లో ఇరుకొన్నట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. బోల్డ్ పాత్రలో అమలా అదరగొట్టేలా కనిపిస్తోంది. ఆమె ‘ఎ’ సర్టిఫికెట్ తో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో థ్రిల్లింగ్ అంశాలతోపాటు అమలా గ్లామర్ షో చేయనుందని అర్థమవుతోంది.