అఖిల్ కోసం పేతురాజు ?

అఖిల్ అక్కినేనికి నాల్గో సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం. హీరోయిన్ దొరక్కపోవడం కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది. సినిమాలో హీరోయిన్ ప్రాధ్యాన్యత ఎక్కువట. దీంతో కాస్త పేరున్న హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన, కైరా అడ్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ సెట్ కాలేదు. తాజాగా నివేదా పేతురాజు పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్రోచేదెవరురా సినిమాలో పేతురాజు నటనతో ఆకట్టుకొంది. అంతకుముందు చిత్రలహరితో ఆకట్టుకొంది. అందం, అభినయంలోనూ పేతురాజుకి వంకపెట్టలేం. కాకపోతే.. అఖిల్ పక్కన కాస్త ముదురుగా కనిపిస్తుందట. దీంతో చిత్రబృందం ఆలోచనలో పడింది. మరీ.. పేతురాజుని ఫైనల్ చేస్తారా ? మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తారా ?? అన్నది చూడాలి.
