‘సాహో’లో కమెడియన్ యాక్షన్ హైలైట్ గా ఉండనుందా ?

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఈ నేపథ్యంలో సాహో పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలని తగ్గట్టుగానే సాహో టీజర్, పోస్టర్లు ఉన్నాయి. ట్రైలర్ తో సాహో స్టామినా ఏంటన్నది మరింత క్లారిటీ రానుంది.
ఈ సినిమా నుంచి ప్రభాస్, శ్రద్దాకపూర్ లుక్స్ తర్వాత వరుసగా విలన్ లుక్స్ ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ తో పాటు మరో ఇద్దరు విలన్స్ అరుణ్ విజయ్, చుంకీ పాండే, జాకీష్రాఫ్ లుక్ లని విడుదల చేశారు. విలన్స్ అంతా స్టయిలీష్ లుక్స్ కనిపిస్తున్నారు. వీరిలో చుంకీ పాండే బాలీవుడ్ లో పలు సినిమాల్లో కామెడీ చేశారు. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
ఇప్పుడీ కమెడియన్ సాహో లో యాక్షన్ చేయబోతున్నాడు. తన యాక్షన్ తో ప్రేక్షకులని సప్రైజ్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. చుంకీ పాండే ఈ క్యారెక్టర్ పోస్టర్‌కు ‘రైజ్ ఫ్రమ్ ది యాషెస్’ అనే పవర్ఫుల్ క్యాప్షన్ పెట్టారు. ఈ లైన్ ని చూస్తే చుంకీ పాండే భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. మరీ.. కమెడియన్ యాక్షన్ లోకి దిగితే ఎలా ఉంటుందన్నది చుంకీ పాండే చూపించబోతున్నాడు అన్నమాట.. !
