వరుణ్ తేజ్ కు ‘జై’ కొట్టాల్సిందే !

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ మెగా హీరోలకి భిన్నంగా క్లాస్ గా ఎంట్రీ ఇచ్చాడు. కూల్ గా హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మాస్ ని టచ్ చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం ‘వాల్మీకి’. హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ ఇది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వరుణ్ నాటుగా కనిపిస్తున్నాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోమవారం వాల్మీకి ట్రైలర్ విడుదలైంది. ఇందులో వరుణ్ తేజ్ నటన, ఆయన చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయ్. ‘జై లవ కుశ’ సినిమాలోని జై పాత్రలో యంగ్ టైగర్ ఎన్ టీఆర్ నట విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ‘వాల్మీకి’లో గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ జై పాత్రని గుర్తు చేశాడు. ఆ హావాభావాలు, డైలాగ్ డెలవరీ జై పాత్రని గుర్తు చేశాయి. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ కి జై కొట్టాల్సిందేనని అంటున్నారు మెగా అభిమానులు. ముందు వాల్మీకి ట్రైలర్ ని మీరు చూడండి.. ఆ తర్వాత వరుణ్ కి జై కొట్టండి.. !
