చాణక్య టీజర్ టాక్

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఇదో యాక్షన్ స్పై థ్రిల్లర్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే టీజర్ లో చూపించారు. టీజర్ ని యాక్షన్ తో నింపేశారు.
ఈ చిత్రంలో ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. టీజర్ వాటికి సంబంధించిన షాంపిల్స్ చూపించారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్ నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
