తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి !

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వివాహం తిరుపతిలో జరగనుంది. సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగనుంది.  జాన్వీ కంచి జరీ చీరని ధరించనుంది. పెళ్లి తర్వాత దక్షిణాది వంటకాలు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ తదితర వంటకాలతో పెళ్లి భోజనం ఉండనుంది. ఇంతకీ జాన్వీ పెళ్లెప్పుడు ? అంటే మాత్రం ఇప్పుడు కాదు. అది జరిగినప్పుడు. పెళ్లి మాత్రం తిరుపతిలోనే.

ఇటీవల జాన్వీ ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లిపై పై విధంగా స్పందించింది. కాబోయే వాడు ఎలా ఉండాలంటే ? అతడికి తన వృత్తి పట్ల అంకితభావం ఉండాలి. చాలా నైపుణ్యం ఉండాలి.. అతడి దగ్గర కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేను ఉత్సుకత చూపించాలి. అంతేకాదు హాస్యచతురత చాలా ముఖ్యం. నేనంటే అతడికి బాగా ఇష్టం ఉండాలని పెద్ద లిస్టే చెప్పింది. మగవారి విషయంలో నా తీర్పుపై అమ్మకు నమ్మకం ఉండేదు కాదు. ఈ విషయంలో నా అభిప్రాయాల్ని నమ్మేది కాదు. నా కోసం ఒకర్ని తనే సెలక్ట్ చేయాలి అనుకుంది. ఎందుకంటే నేను ఇతరుల్ని చాలా తేలిగ్గా ప్రేమించేస్తుంటానని జాన్వీ చెప్పుకొచ్చింది.