కోలీవుడ్ హీరోయిన్’తో మనీశ్ పాండే పెళ్లి !


టీమిండియా యువ ఆటగాడు మనీశ్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ అర్షితా శెట్టిని పెళ్లిచేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్సయింది. ఈ ఏడాది డిసెంబర్ 2న ముంబయిలో వీరిద్దరూ ఒక్కటికాబోతున్నారని సమాచారం.

మనీష్-అర్షితా ప్రేమలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల నుంచి ఈ జంట విందు, వినోదాలకు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారట. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. మనీశ్, అర్షిత వివాహం అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వెస్టిండీస్ తో టీ20 సందర్భంగా డిసెంబర్ 2న టీమిండియా సభ్యులు ముంబయిలోనే ఉంటారు. వారంతా ఈ పెళ్లికి హాజరుకానున్నారు.  

ముంబయికి చెందిన అర్షిత (26) తుళు భాషలో “తెళికెడా బొల్లి” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘ఉదయం ఎన్ హెచ్ 4’ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్, ఇంద్రజిత్  సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆర్ పన్నీర్ సెల్వం దర్శకత్వంలో నాన్ దా శివ చిత్రంలో ఆమె నటిస్తోంది.