తెలంగాణలో ప్లాస్టిక్ బ్యాన్


మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్నప్లాస్టిక్ నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.గురువారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యావరణంపై చర్చ సందర్భంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని సీఎం నిర్ణయించారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేబినేట్ సమావేశంలో చర్చించి ప్లాస్టిక్ నిషేధంపై ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

ఇక గ్రామాల్లో 30రోజుల ప్రణాఌక వలన ప్రజలకి పారిశుద్ధ్యం అవగాహన కలిగింది. భవిష్యత్ లోనూ ఇలాంటి కార్యక్రమాలని చేపడతామని సీఎం అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లను సీఎం అభినందించారు.