చిరంజీవికి హ్యాట్సాఫ్


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల విడుదలైన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాత. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి సైరా చిత్రబృందాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. “చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం తనకు కలిగిందని, సైరా లాంటి పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం కూడా ఉండాలని అన్నారు. చిరంజీవి లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి బహుమతి ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో నటించిన చిరంజీవికి హ్యాట్సాఫ్” అన్నారు. ఈ కార్యక్రమానికి సైరా చిత్రబృందంతో పాటుగా దిల్ రాజు,  మురళీమోహన్, వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు.