ఏపీకి సీబీఐ.. జగన్’కి షాక్ !

ఏపీ సీఎం వైస్ జగన్ పై అవినీతి ఆరోపణల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గతంలో జైలుకెళ్లి వచ్చారుజగన్. సీఎం అయ్యాక.. ప్రతివారం సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రతివారం హైదరాబాద్ రావడంతో ప్రజా సమస్యలు పెడింగ్ లో ఉండిపోతున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఐతే, ఇప్పుడు సీబీఐ కోర్టునే ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది భాజాపా.
తాజగా ఏపీ భాజాపా నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించాలని కోరుతూ రవిశంకర్ కి ఓ లేఖ అందించారు. విభజన తర్వాత విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించారని, అది ఇంకా ప్రారంభం కాలేదని.. వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ – గుంటూరులో ప్రారంభించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి రవిప్రకాష్ ని కలిసిన వారిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు.
