బాలయ్య-బోయపాటి.. ప్యాన్ ఇండియా సినిమా ?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. బాహుబలి, సాహో సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ బాలీవుడ్ లో సందడి చేయనున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేయబోయే సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా చేసే ప్రయత్నాల్లో తారక్ ఉన్నారని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్, మహేష్ బాబులు ప్యాన్ ఇండియా చేసే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పుడు వీరి దారిలో సీనియర్ హీరో బాలయ్య కూడా ఉన్నాడా ? అనే అనుమానాలొస్తున్నాయ్.

బోయపాటి-బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 70కోట్లు ఖర్చు చేయనున్నారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని తీసుకోనున్నారట.

ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య-బోయపాటి సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా తీసుకొసున్నారా.. ? బాలీవుడ్ నటీనటులని తీసుకొని.. అక్కడ రిలీజ్ చేస్తారా ? అనే డౌట్లు కలుగుతున్నాయి. ఈ యేజ్ లో బాలయ్య బాలీవుడ్ హవా చూపిస్తే.. అది రికార్డే అవుతుంది మరీ.. !
