‘అజ్ఝాతవాసి ఆడియో వేడుక రైట్స్’ రేటెంతో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఝాతవాసి”గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అజ్ఝాతవాసి. అంతకంటే ముందు ఈ సినిమా ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న హెచ్ ఐసిసిలో అజ్ఝాతవాసి ఆడియో వేడుకని నిర్వహించనున్నట్టు సమాచారమ్.
పవన్ సినిమా ఆడియో ఆడియో వేడుక అంటే మీడియాకు పండగే. ఇప్పుడీ సినిమా ఆడియో వేడుకని ప్రస్తారం చేసేందుకు టీవీ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అజ్జాతవాసి ఆడియో వేడుక రైట్స్ ని టీవీ5 సొంతం చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ. 85లక్షల భేరం కుదిరిందట. దీంతో.. అజ్ఝాతవాసి ఆడియో వేడుకని కేవలం టీవీ 5లో నే ప్రసారం కానుంది. ఒకవేళ టీవీ5 ఇతర ఛానెల్స్ కి షేర్ ని అమ్ముకొంటే మాత్రం మిగితా ఛానెల్స్ లోనూ లైవ్ చూడొచ్చు.
