‘అజ్ఝాతవాసి’ పాటల వేడుక.. అన్నయ్య ముఖ్య అతిథి !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని “అజ్జాతవాసి”గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతకంటే ముందు ఈ నెల 19న ‘అజ్ఝాతవాసి’ పాటల వేడుక హైదరాబాద్ లోని హైటెక్స్’లో జరగనుంది. ఈ వేడుకకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
అన్నయ్యతో పాటు మెగా హీరోలంతా ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్టు సమాచారమ్. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తి స్థాయిలో పొలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ పవన్ సినిమా చేసేందుకు చాన్నాళ్లే పట్టొచ్చు. ఈ నేపథ్యంలో ‘అజ్ఝాతవాసి’ పాటల పండగని మెగా అభిమానులకి ఓ తీపి గుర్తుగా మిగల్చబోతున్నారు. ఇదే నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజు, వరుణ్ తేజు, శిరీష్, కళ్యాణ్.. ఒకే స్టేజీపై కనబడనున్నారు.
