ఛార్మి షాకింగ్ వీడియో.. తప్పు అని తెలిసినా !

చావు దగ్గర నవ్వినట్టుంది సీనియర్ హీరోయిన్ ఛార్మీ తీరు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్ తో సహా 64 దేశాలకి ఈ మహమ్మారి సోకింది. సోమవారం తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. తెలంగాణ, ఢిల్లీలోనూ ఒక్కో కరోనా కేసు నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ ఛార్మి షాకింగ్ వీడియో ఒకటి ఫోస్ట్ చేసింది. ఇందులో “కరోనా వైరస్‌కు స్వాగతం, ఆల్ ది బెస్ట్” అని చెప్పింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిది. అయితే ఛార్మీ తీరుపై నెటిజన్స్ మండిపడ్డారు. ఆల్ ది బెస్ట్ చెప్పే సబ్జెక్ట్ నా ఇది అంటూ ఛార్మిని గట్టిగా వేసుకున్నారు. దీంతో చేసిన తప్పుని తెలుసుకున్న ఛార్మీ క్షమాపణలు చెప్పింది.

”మీరు చేసిన కామెంట్స్‌ చూశాను. ఆ వీడియో చేసినందుకు సారీ చెబుతున్నా. ఇది చాలా సున్నితమైన అంశం. అపరిపక్వత, అవగాహనాలేమితో అలా మాట్లాడాను. ఇకపై ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కావు” అని ఛార్మి రాసుకొచ్చింది.

ఛార్మీ తెరపై కనిపించక చాన్నాళ్లవుతోంది. ఆమె తెర వెనక పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకి ఇష్టమైన దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తున్న ఫైటర్ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. 
ప్రస్తుతం ఛార్మీ ‘ఫైటర్’ సినిమా ఇది.