ఎన్‌పీఆర్‌పై సీఎం జగన్ సంచలన ప్రకటన

దేశ వ్యాప్తంగా ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లకి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్‌పీఆర్ (దేశ జనాభా పట్టిక)పై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీలో సమావేశాల్లో ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని సీఎం జగన్ ట్విట్ చేశారు.

ఎన్‌పీఆర్‌లో పొందుపరిచిన పలు ప్రశ్నల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీలలో అభద్రతా భావం ఏర్పడుతోందని సీఎం జగన్ అన్నారు. దీనిపై పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత, 2010లోని జనాభా పట్టికలోని అంశాలనే తిరిగి పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దానికి కేంద్రం నో చెప్పిన నేపథ్యంలో.. రాబేయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.