చంద్రబాబు రాక్షస మాటలు.. బొత్స నోటితో !

వైసీపీ నేతలు రాక్షలు. తాను యజ్ఞం చేస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించేవారు చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన పదే పదే వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఇవే మాటలని మంత్రి బొత్స చంద్రబాబు అండ్ కో ని విమర్శించడానికి వాడటం ఆకట్టుకుంటోంది.

తాము 3౦ లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తలపెడితే చంద్రబాబు అడ్డుకుంటున్నారని బొత్స అన్నారు. లోక్ కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా అడ్డుకున్నారో పురాణాలలో ,సినిమాలలో చూశామని , ఇప్పడు జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు,ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని బొత్స అన్నారు. మాటకు మాట అప్పజెప్పడం అంటే ఇదేనేమో.. !