తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది రోజు విడిచి రోజు గానీ వారం విడిచి వారం గానీ విధులకు హాజరు కావాలని ఆదేశించారు.

గతంలో జారీచేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ నెల 4తో ముగిసింది. దీంతో ఈ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ న్ విధించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దీనిపై స్వయంగా సీఎం కేసీఆర్ నే ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్ లాక్‌డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నాస్తోంది. అసలు హైదరాబాద్ లాక్‌డౌన్ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది.