గమనం.. మరో వేదం !

సీనియర్ హీరోయిన్ శ్రేయ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సుజనరావు, మాటలు బుర్ర సాయి మాధవ్. ఇళయరాజా సంగీతం అందించారు. అయిదు భారతీయ భాషల్లో తయారవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గతంలో వేదం తదితర సినిమాల మాదిరిగానే మూడు కథల సమహారం గమనం అని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. స్లమ్ లో వుండే గృహిణిగా శ్రియ కనిపిస్తోంది.
ఇద్దరు పిల్లల తల్లి. పైగా మూగ. ఇదీ శ్రియ పాత్ర ప్రత్యేకత. దుబాయ్ కు ఉద్యోగానికి వెళ్లిన భర్త కోసం ఆమె ఎదురుచూపులు. అలాగే శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ లు ఓ జంటగా వారిదో కథగా వుంది. మాంచి క్రికెటర్ కావాలన్న కోరిక శివ కందుకూరిది. ఇద్దరు అనాధ రోడ్ కిడ్స్ కథ మరోటి. బర్త్ డే ను చేసుకోవాలనే కోరిక వారిది. వీరి జీవితాలని హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు ఎలా అతలాకుతలం చేశాయన్నది చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
