గుడ్ న్యూస్.. నాగ్’కు కరోనా నెగటివ్ !

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జునలోనూ కరోనా కలవరం మొదలైంది. ఎందుకంటే ? గత శనివారం చిరు, నాగ్ కలిసి సీఎం కేసీఆర్ ని కలిశారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు.
ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటీవ్ వచ్చిందని టాక్. ఇటీవల నాగ్ కులూమనాలీ వెళ్లొచ్చారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు తెలిసింది. చిరుకి కరోనా సోకిన నేపథ్యంలో… నాగ్ మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. నాగ్ ని నెగటివ్ రావడంతో అంతా ఊరిపిపీల్చుకున్నారు. ఒకవేళ నాగ్ కి కరోనా పాజిటివ్ వచ్చి ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి ఇబ్బంది కలిగేది.
