గ్రీన్ ఛాలెంజ్’లో పాల్గొన్న నభా

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటాషా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారు. తెరాస ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటినట్లు తెలిపారు. పచ్చదనం పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, అను ఇమాన్యుల్, నిధి అగర్వాల్ కు ఈ ఛాలెంజ్ ని విసిరారు నభా.

నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటాషా. ‘ఇస్మార్ట్ శంకర్’తో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకొంది. గ్లామర్ పాత్రలకి సరిగ్గా సరిపోయే నభాకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే కరోనా లాక్డౌన్ తో నభా స్పీడుకు బ్రేకులు పడ్డాయ్. కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్న నభా ఆగలేకపోయింది. ఉన్నంతలో ఫోటో షూట్స్ చేస్తోంది. చీరకట్టు అందాలతో అభిమానులని ఖుషి చేస్తోంది.

