‘సీతాయణం’ టీజర్’ని వదిలిన రవితేజ

కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ”సీతాయణం” అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంతో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ను కూడా అక్షిత్ పలకరించబోతున్నాడు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్నారు. అక్షిత్ సరసన అనహిత భూషణ్ హీరోయిన్ గా నటించింది.

రోహన్ భరద్వాజ్ సమర్పణలో కలర్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టీజర్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ‘కామి కానివాడు.. మోక్షగామి కాలేడు’ అనే లైన్ తో టీజర్ మొదలైంది. టీజర్ లో యాక్షన్ హైలైట్ గా ఉంది. డైలాగ్స్ కూడా ఒకట్రెండు బాగానే పేలాయ్.