అనసూయ స్టార్ హీరోయిన్ అయిపోయిందోచ్ !


హాట్ యాంకర్ అనసూయ స్టార్ హీరోయిన్ అయిపోయిందోచ్!. స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేస్తే.. స్టార్ హీరోయిన్ నే అంటారు. ఇప్పుడు హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చేయని అనసూయ.. ఏకంగా మాస్ మహారాజ రవితేజ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

ర‌వితేజ న‌టించిన ‘క్రాక్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మ‌రో కొత్త సినిమాకు ర‌వితేజ అంగీక‌రించారు. ‘ఖిలాడీ టైటిల్‌’తో సినిమా తెర‌కెక్క‌నుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. యాక్ష‌న్‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్ప‌టికే మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తిని హీరోయిన్ల‌గా ఎంపిక చేసుకున్నారు. ఇక మూడో హీరోయిన్‌గా హాట్ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ‌ను ఎంపిక చేసినట్టు సమాచారమ్. ఇందులో అన‌సూయ  అగ్ర‌హారపు బ్రాహ్మ‌ణ యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ని టాక్.