కేంద్రం నిధులు.. సంచలన నిజాలు బయటపెట్టిన కిషన్ రెడ్డి !

కేంద్రం నుంచి తెలంగాణకు పైసా కూడా రావడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కేంద్రం నుంచి పైసా పరిహారం రాలేదని సీఎం కేసీఆర్ పాటుతో పాటు తెరాస నేతలంతా చెప్పుకొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వేదికగా కేంద్రం నిధులపై మంత్రి హరీష్ రావు ఒకటి రెండు సార్లు సవాల్ విసిరారు. అప్పుడు ఆ సవాళ్లని స్వీకరించే ధైర్యం చేయని తెలంగాణ భాజాపా.. ఇప్పుడు మాత్రం సంచలన విషయాలని బయటపెడుతోంది.
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది తెలంగాణకు కేంద్రం నిధుల విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. పంట నష్టంపై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమ్రగ్ర నివేదిక ఇవ్వలేదన్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికారిక ట్విట్టర్ లో వీడియోని షేర్ చేశారు. నేను ఈరోజు కూడా కేంద్రాన్ని అడిగాను. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపలేదని చెప్పారని.. ఇప్పటికైనా కేంద్రానికి నివేదికలు పంపాలని సీఎం కేసీఆర్ ని కోరుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ అస్తవ్యస్తంగా తయారైంది
:- @kishanreddybjp , కేంద్ర హోంశాఖ సహాయమంత్రి@trspartyonline @BJP4India pic.twitter.com/MyUcGcpJyv— BJP Telangana (@BJP4Telangana) November 11, 2020
