‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి పాత్ర కూడా వివాదాస్పదమే ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతరామరాజు, కొమరంభీమ్ ల జీవితాల్లోని ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఈ కథని రాసుకున్నారు జక్కన్న. ఇదో ఫిక్షనల్ స్టోరీ అని ముందే చెప్పారు. అయితే కొమరంభీమ్, అల్లూరి పాత్రల విషయంలో వివాదాలు తలెత్తేలా ఉన్నాయ్.

కొమ‌రం భీమ్ నిజాంల‌పై పోరాడాడు. త‌న‌ని ఓ ముస్లింగా చూపించాడు రాజ‌మౌళి. ఇటీవల రిలీజైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ లో కొమరంభీమ్ పాత్రలో తారక్ ముస్లిం టోపీ ధరించడంపై తీవ్ర విమర్శలొచ్చాయ్. అల్లూరి పాత్రపై కూడా ఇలాంటి వాదాదం తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.  అల్లూరి సీతారామ‌రాజు తెల్ల దొర‌ల‌పై పోరాటం చేశాడు. పోలీస్ స్టేష‌న్ ని భూస్థాపితం చేశాడు. 

అలాంటి అల్లూరి ఖాకీ బ‌ట్ట‌ల్లో చూపిస్తున్నాడు. పైగా జ‌లియ‌న్ వాలా బాగ్ కి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంద‌ని తెలుస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు ఈ జ‌లియ‌న్ వాలా బాగ్ ఘ‌ట‌న‌లో పాల్గొన్నాడ‌న్న అర్థం వ‌చ్చే రీతిలో ఓ స‌న్నివేశాన్ని డిజైన్ చేశాడ‌ట‌. అది కూడా విమ‌ర్శ‌లకు తావిస్తుందేమో అనిపిస్తోంది.