బీసీల‌పై వైసీపీ రెండు ప్రైవేట్ బిల్స్ .. !

బీసీల హక్కులను పరిరక్షిచేందుకు, రాజ్యాంగబద్దత కల్పించేందుకు ఈరోజు రాజ్యసభలో రెండు ప్రైవేట్ మెంబెర్ బిల్స్ ప్రవేశ పెట్టారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. 2014 లోకసభ ఎన్నికల తరవాత ఇప్పుడున్న సభలో 20 శాతం మాత్రమే బీసీలు వున్నార‌ని, రాజ్యాంగంలోని 330A, 332A రెండు సవరణలను ప్రవేశపెట్టి రాజ్యాంగ బద్దత కల్పించేలా పార్లమెంట్లోను, అసెంబ్లీల్లోను జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఈ బిల్లు ఉదేశ‌మ‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.

బీసీలకు ప్రభుత్య ఉద్యోగాల్లోను,విద్యాసంస్థల్లోనూ జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ కల్పించాలని రెండో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టానన్నారాయ‌న‌. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలమేరకు బీసీలకు న్యాయం చేయలనే ఉదేశ్యం తో రెండు ప్రైవేట్ మెంబెర్ బిల్లులను ప్రవేశ పెట్టాన‌ని చెప్పారు.

ఈ సమావేశాలలో ఓబీసీ బిల్ ఆమోదం పొందుతుందని విశ్వాసంతో ఉన్నామని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఏపీలో ఉన్న 28 వేల రేషన్ షాపుల్లో చంద్రబాబు ప్రభుత్వం 6 వేల రేషన్ షాపు లను ప్రైవేట్ పరం చేయడం ఏపీ ప్రభుత్వ ఉద్దేశంగా ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా రేషన్ షాపులను ప్రైవేట్ పరం చేసే పనిలో ఉన్నారని, వైసీపీ ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు రేషన్ షాపుల్లో 13 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారన్నారు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.