రజనీ కోసం స్పెషల్ కేక్

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు సోషల్ మీడియా వేదికగా రజనీని విష్ చేశారు.
రజనీ ఇంట్లో బర్త్ డే సెలబ్రెషన్ జరిగాయి. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ స్పెషల్ కేకుని డిజైన్ చేయించారు. దానిపై ‘Now Or Never’ అని రాసి ఉంది. రజనీ కేక్ కట్ చేస్తున్న ఫోటోని సౌందర్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక పొలిటికల్ ఎంట్రీపై రజనీ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. జనవరిలో పార్టీ ఏర్పాటు ఉండనుంది. అయితే రజనీ జెండా-అజెండా ఎలా ఉండనుంది ? అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే యేడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని రజనీ భావిస్తున్నారు.
Happy birthday my life .. dearest appa ❤️❤️❤️😇😇😇 #NowOrNever 🤘🏻🤘🏻🤘🏻😀😀😀 #ThalaivarBirthday #OneAndOnly pic.twitter.com/3BYztWitd5
— soundarya rajnikanth (@soundaryaarajni) December 12, 2020
