క్యాన్సర్’తో హాలీవుడ్ నటుడు కన్నుమూత

హాలీవుడ్ నటుడు డస్టిన్ డైమండ్ (44) క్యాన్సర్ తో కన్నుమూశాడు. మూడు వారాల క్రితమే డిస్టన్ కు క్యాన్సర్ అన్న సంగతి బయటపడింది. అయితే ఈ మహమ్మారి చాలా స్పీడుగా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసింది. దీంతో డస్టిన్ కన్నుమూశారు. డిస్టన్ మృతిపట్ల హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సేవ్ బై ది బెల్ అనే విజయవంతమైన టీవీ సీరియల్‌తో డస్టిన్ డైమండ్ వెలుగులోకి వచ్చాడు. స్క్రీచ్ అనే పాత్రతో చాలా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అతడు క్యాన్సర్ కి గురికావడం.. నెలలోపే ఈలోకాన్ని విడిచిపెట్టాడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
