తల్లి కాబోతున్న బుల్లితెర నటి

“అష్టాచెమ్మా” సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయింది చైత్ర రాయ్. ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. ఇటీవల ‘అక్కాచెల్లెళ్లు’ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకుంది. దానికి కారణం ఏమై ఉంటుంది ? అని ఆమె అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు.. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. ప్రస్తుతం చైత్ర ప్రెగ్నెంట్. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ గుడ్ న్యూస్ ని స్వయంగా చైత్రనే చెప్పింది.
“ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి. కెరీర్, పని.. వంటివాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలి. నేను నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది.
