బాలయ్య చేతిలో అర‌డ‌జ‌ను అడ్వాన్సులు

సినిమాల్ని ఒప్పుకోవ‌డంలో బాలయ్య పంథా వేరు. ఆయనకు క‌థ న‌చ్చితే చాలు. మరేవీ పట్టించుకోరు. నిర్మాతలని అస్సలు ఇబ్బంది పెట్టారు. పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోరు. స్క్రిప్టులో వేలు పెట్టడాలు.. దర్శకుడిని ఇబ్బంది పెట్టడాలు బాలయ్యకు తెలియవు. అందుకే ఆయన వెంట ఇప్పటికీ దర్శక-నిర్మాతలు వెంటపడుతుంటారు.

అఖండ త‌ర‌వాత వ‌రుస‌గా రెండు ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టాడు బాల‌య్య‌. అయితే మ‌రో అర‌డ‌జ‌ను అడ్వాన్సులు బాల‌య్య చేతిలో ఉన్న‌ట్టు టాక్‌. మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. దిల్ రాజు బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయాలి. సి.క‌ల్యాణ్ ఇప్ప‌టికే బాల‌య్య‌కు అడ్వాన్స్ ఇచ్చాడు. మాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు బాల‌య్య‌కు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చారు. రాజ్ కందుకూరి సైతం బాల‌య్య‌తో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ సంస్థ‌లో బాల‌య్య ఓ సినిమా చేయాలి. ఇవికాకుండా మరో నలుగురు నిర్మాతలు కూడా బాలయ్యతో టచ్ లో ఉన్నట్టు సమాచారమ్.