కథలు రాస్తున్న హీరోలు

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత మాత్రమే కాదు.. కథల కొరత కూడా ఉంది. అందుకే కొందరు హీరోలు ఆ కొరతని తీర్చేందుకు కలం పట్టారు. కథలు రాస్తున్నారు. అడవి శేష్ కథలు రాస్తున్నారు. ఆ కథలతో హీరోగా హిట్స్ అందుకుంటున్నారు. ఇక హీరో నాని స‌హాయ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించాడు. హీరోగా సెటిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు నాని కలం పట్టి ఓ కథ రాశాడు. ఆ కథని ఓ మంచి దర్శకుడి చేతిలో పెట్టీ.. తానే నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడు.

అల్ల‌రి న‌రేష్ కూడా స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసిన వాడే. ఇప్పుడు న‌రేష్ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. అది త‌న కోస‌మే. కాక‌పోతే.. డైరెక్ష‌న్ మాత్రం తాను చేయ‌డ‌ని స‌మాచారం. మాస్ మహారాజా ర‌వితేజ ద‌గ్గ‌ర కూడా కొన్ని క‌థ‌లు ఉన్నాయి. వాటిలోని ఓ క‌థ ఎంచుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న‌ది ర‌వితేజ ఆలోచ‌న‌. ఇక సీనియర్ హీరో మోహన్ బాబు స‌న్ ఆఫ్ ఇండియా కోసం రచనా సాయం అందించారు. సినిమాలతో బిజీ బిజీగా ఉండే హీరోలకు లాక్ డౌన్ తో టైమ్ దొరికింది. ఈ ఖాళీ టైమ్ లో తమలోని కొత్త కోణాన్ని బయటికి తీశారు. \