చరణ్-ఉపాసన.. లంచ్ పిక్ !

వీకెండ్ లో చేయాల్సిన పనిని.. వీక్ మధ్యలోనే చేసేస్తోంది ఉపాసన. తాజాగా భర్త రామ్ చరణ్ తో కలిసి లంచ్ కోసం కూర్చున్న ఫోటో ఒకటి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘మిడ్ వీక్.. లంచ్ బ్రేక్.. లంచ్ డేట్’ అంటూ కామెంట్ పెట్టింది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ నెలతో షూటింగ్ పూర్తికానుంది. ఆ తర్వాత గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఉండనుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. సోషల్ మెసేజ్ కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారమ్.
