12 నుంచి #RAPO19 షూటింగ్ మొదలు

ఎనర్జిటిక్ హీరో రామ్.. తన తర్వాతి సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట.

ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ చిన్నది కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.