న్యాయం చేయమంటే.. అక్రమ కేసులు పెడుతున్నారు !

ఏపీ రాజధాని అమరావతి రైతులు రైతులు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమను మోసం చేశారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

రాజధాని కోసం భూములు ఇస్తే తమను రోడ్డున పడేశారని.. న్యాయం చేయమంటే అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. రైతులకి అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ హామీ ఇచ్చారు.