మోహన్‌బాబు ప్రశ్నలకు నాగబాబు కౌంటర్

గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని అతి తక్కువ ధరకు అమ్మేశారంటూ ఇటీవల మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం అంతా నరేశ్-శివాజీరాజాలకే తెలుసని.. భవనం అమ్మకం గురించి నరేశ్‌నే ప్రశ్నించాలన్నారు.
బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. సినిమా పెద్దల సూచనలు.. అప్పుడు ఉన్న అవసరాలు దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశాం. ఇంటిరీయర్ డిజైన్ కోసం మరో రూ.3 లక్షలు వెచ్చించాం. 2006-08 వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. 2008లో అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదు. శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్ కార్యదర్శిగా ఉన్నప్పుడే బిల్డింగ్ బేరం పెట్టి రూ.30 లక్షలకే దాన్ని అమ్మేశారు. కాబట్టి ‘అతితక్కువ ధరకు బిల్డింగ్ ఎందుకు అమ్మేశారు?’ అని నరేశ్‌ని అడగండని నాగబాబు అన్నారు.
