ఆమిర్ ఖాన్ సినిమాలో ఆఫర్ వదిలేశా !

బాలీవుడ్ సినిమా ఆఫర్. అందులోనూ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమా. స్వయంగా ఆమిర్ ఖాన్ ఫోన్ చేసి అడిగితే.. ఎవరైనా కాదంటారా ? కానీ టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నో చెప్పేశాడు. రెండు నెలల క్రితం ‘లాల్సింగ్ చద్దా’ సినిమా కోసం ఆమిర్ ఖాన్ ఫోన్ చేశారు. డేట్స్ కుదరలేదు. వదిలేశానని చాలా సింపుల్ గా చెప్పేశారు నాని.
ప్రస్తుతం తెలుగులోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. భవిష్యత్తులో ఏదైనా మంచి కథ కుదిరితే.. ఓ ఆర్నెల్లు గ్యాప్ తీసుకుని అటు వైపు ప్రయత్నించాలి. నిజానికి నాకు తెలుగులో ఉన్నంత కంఫర్ట్ హిందీలో ఉండదు. అదే ఆ భాషపై మంచి పట్టుంటే అది వేరేలా ఉంటుంది. ఎంచుకున్న కథకీ వందశాతం న్యాయం చేయగలుగుతాం. భాష రాలేదంటే.. యాభై శాతమే న్యాయం చేయగలుగుతాం అంటూ తన వర్షన్ చెప్పుక్కొచ్చారు నేచురల్ స్టార్.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటించిన రెండో సినిమా ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నానికి జంటగా రీతూ వర్మ నటించింది. ఎప్పడ్నుంచో పండగకి థియేటర్స్ లోకి రావాలనుకున్నా. కానీ కరోనా సెకండ్ వేవ్ తో అది కుదురక పండగరోజున ఓటీటీలోకి వచ్చేస్తున్నానని నాని అన్నారు.
