‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్.. మళ్లీ సంక్రాంతి రేసులోకి !

సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ను కాస్త బలవంతంగానే తప్పించారు. రెండు పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండేళ్లుగా షూటింగ్ జరుపుకున్నయి. వీటికి పోటీగా పవన్ సినిమా వస్తే డ్యామేజ్ మాములుగా ఉండదు. అందుకే పవన్, ఆయన చిత్రబృందాన్ని ఒప్పించిన నిర్మాత మండలి.. భీమ్లా నాయక్ ను సంక్రాంతి రేసు నుంచి తప్పించగలిగి.. ఫిబ్రవరి 25కి షిఫ్ట్ చేసింది.
అయితే ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకుంది. దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. అన్నీ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నారు. థియేటర్స్ మూతపడుతున్నాయి. అందుకే ఆర్ ఆర్ ఆర్ ను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ అనే ప్రచారం మొదలైంది. పవన్ సినిమా మళ్లీ సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై మరో 24 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాధేశ్యామ్, వాలిమై సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క థియేటర్స్ రిలీజ్ మాత్రమే సరిపోదు. దాంతో పాటు ఓటీటీలోనూ సినిమా విడుదలైతే.. సేవ్ అని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
