లైగర్.. ఆల్ టైమ్ రికార్డ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చెప్పినట్టుగానే ఇండియాను షేక్ చేస్తున్నడు. ఆయన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ఇండియా రికార్డ్ కొట్టింది. 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో 400k లైక్స్ ఉన్నాయి. యూ ట్యూబ్ లో నెంబర్-1గా ట్రెండ్ అవుతున్నది.
ఈ నేపథ్యంలో లైగర్ తో ‘ఇండియాను షేక్.. ‘ అంటూ గతంలో చెప్పిన విషయాన్ని విజయ్ దేవరకొండ గుర్తి చేశారు. ఇక ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ నట విశ్వరూపం చూపించారు. బాక్సింగ్ రింగ్ లో గట్టిగా గర్జించాడు. ఆ గర్జనకు ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. అయితే ఇది షాంపిల్ మాత్రమే ముందు.. ముందు.. లైగర్ సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయమని చిత్రబృందం చెబుతున్నది.
