బాలీవుడ్ లో పుష్ప హాఫ్ సెంచరీ.. నాటౌట్ !

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప’ అదరగొడుతోంది. ఇప్పటికే రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. తొలిరోజు నుంచి పుష్ప బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రతిరోజు రూ. 3.5 నుంచి 4.5 కోట్ల మధ్య వసూలు చేసుకుంది. పుష్ప దెబ్బకు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ కూడా తగ్గాయి. బాలీవుడ్ లో పుష్ప సినిమాని పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు. కంటెంట్ బలంగా ఉంటే ప్రమోషన్స్ అవసరం లేదని పుష్ప నిరూపించింది.

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప తెరకెక్కింది. బన్నీకి జంటగా రష్మిక మందన నటించింది. ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత మెరిసింది. మలయాళ స్టార్ ఫాహిత్ ఫాజల్ విలన్ పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదలైన పుష్ప బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఓవర్ ఆల్ గా పుష్ప కలెక్షన్స్ రూ. 300కోట్లు దాటిపోయాయి.