పవన్ ముఖ్యమంత్రి.. అంతే !

రాజకీయాల్లో సహనం చాలా అవసరం అంటారు. జనసేన ఇప్పటికే చాలా ఓపిక పట్టింది. ఓట్లు చీలిక పోకూడదని 2014లో బీజేపీ కి మద్దతు ఇచ్చింది. ఇక 2019లో బీజేపీతో కలిసి నడించింది. అయితే ఈసారి మాత్రం అస్సలు తగ్గేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి మీరే తగ్గండని బీజేపీ, టీడీపీలకు నేరుగానే చెప్పేశారు పవన్. అంతేకాదు.. పొత్తుల ఆప్షన్ ల గురించి బాహాటంగానే మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ+జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రకటన చేయాలని జనసేన వర్గాలు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు నుంచి మొదలైన ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అట్టుకుంది. ఇది మంచి ఎత్తుగడనే. ఎందుకంటే ? బీజేపీ కాదంటే.. జనసేన టీడీపీతో కలిసే ఆప్షన్ ఒకటి ఉంది. అదీగాక.. పవన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటే.. ఏపీలో పొలిటికల్ ఈక్వెషన్స్ ఒక్కసారిగా మారవచ్చు. పవన్ మంచితనం గురించి అందరికీ తెలుసు. అందుకే ఆయన సీఎం అయితే.. బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే సరైన టైమ్ లో సరైన పాయింట్ లాగింది జనసేన. మరీ.. దీనిపై కమల్ పార్టీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.
