గట్స్ గ్యాంగ్.. ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్స్ చూశారా ?

గర్ల్స్ గ్యాంగ్ ఉంటుంది. ఈ గట్స్ గ్యాంగ్ ఏంటీ ? అనుకుంటున్నారు. అందులో ఉన్నది ఎవరో తెలిస్తే.. మీరు కూడా ఇది గట్స్ గ్యాంగ్ అని అంగీకరిస్తారు. ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మలైకా అరోరా, కరిష్మా కపూర్, కరీనా కపూర్, అమృతా అరోరా మస్త్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. ” అని చాటి చెప్పారు. మాది గర్ల్స్ గ్యాంగ్ కాదు.. గట్స్ గ్యాంగ్ అని కామెంట్ పెట్టారు.
ఈ నలుగురు ముదురు ముద్దుగుమ్మల్లో ఒకరిది ఒక్కో స్టోరీ. మైలైకా గురించి తెలిసిందే. పిల్లలు యంగ్ ఏజ్ కి వచ్చినా.. ఆమె అందం తరగలేదు. పైగా ఇప్పటికీ యంగ్ హీరోయిన్ మాదిరిగా ఎఫైర్స్, డేటింగ్స్ నడుపుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో పీకల్లోతూ ప్రేమలో ఉంది. త్వరలో అతడిని పెళ్లాడనుందట. కరీనా కపూర్ గురించి తెలిసిందే. షాహిద్ కపూర్ తో లవ్వాట ఆడిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సైఫ్ అలీఖాన్ ను పెళ్లాడింది. మిగితా ఇద్దరు కూడా తక్కువేం తినలేదు. అందుకే.. ఇది నిజంగా గట్స్ గ్యాంగే అంటున్నారు నెటిజన్స్లు.
