Official : అర్జున్ రెడ్డి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా (#AA23) ఫిక్సయింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. ఈ ఏడాదే యానిమల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అంటే 2025 లో అల్లు అర్జున్-సందీప్ వంగా సినిమా ఉండనుంది. వీలైతే వచ్చే ఏడాది చివర్లో స్టార్ట్ అయి 2025 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విషయంలో అస్సలు తగ్గేదేలా.. అని బన్నీ ముందు నుంచి చెబుతున్నారు. ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతీ ఫ్రేమ్ బాగా వచ్చేందుకు ఆయన విపరీతంగా కష్టపడుతున్నారట. ఈ విషయాన్ని 18 పేజేస్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. పుష్ప 2 పూర్తయ్యేవరకు మరో సినిమా పై ఫోకస్ పెట్టకూడని బన్నీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్ లో మెరవబోతున్నట్లు సమాచారం.
