పఠాన్ హవా.. బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ !

బాక్సాఫీస్ దగ్గర ‘పఠాన్’ హవా కొనసాగుతుంది. భారీ అంచనాల జనవరి 25 న ప్రేక్షకుల ముందుకొచ్చిన పఠాన్ అంచనాలను మించి అదరగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ రూ. 1000 కోట్లు క్రాస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజీఎఫ్ (రూ. 435 కోట్లు – హిందీ వర్షన్) రికార్డ్ లను బ్రేక్ చేసింది.
ఇప్పుడు బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసేందుకు చేరువైంది. బాహుబలి 2 బాలీవుడ్ లో రూ. 515 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పఠాన్ (హిందీ) ఖాతాలో రూ. 510.65 కోట్లు వచ్చిపడ్డాయి. ఐదో వారంలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ రూ. 8.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ లోగా పఠాన్ బాహుబలి 2 (రూ. 5.15) రికార్డ్ ను బ్రేక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే.. హిందీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పఠాన్ రికార్డులకెక్కనుంది.
ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. షారుక్, దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సంస్థ నుంచి వచ్చిన 50వ సినిమా ఇది. స్టార్టింగ్ లో పఠాన్ రోజుకో వంద కోట్ల రూపాయల చోప్పున కలెక్ట్ చేసింది. తొలివారంలోనే ఈ సినిమా 700 కోట్లు కు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో వెయ్యి కోట్లు క్రాస్ చేసి.. సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
