వరుణ్ తేజ్ బాలీవుడ్ సినిమా.. ఫస్ట్ గ్లింప్స్ చూశారా ?

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ బాట పడుతున్నారు. వరుణ్ తేజ్ – మానుషీ చిల్లర్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు/హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించనున్నారు. దర్శకుడిగా ఇతకిదే తొలి సినిమా. ఇండియర్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో.. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎనౌన్స్ మెంట్ వీడియోలో సన్ గ్లాసెస్ దర్శించి స్టైలీష్ లుక్ లో వరుణ్ తేజ్ కనిపించారు. వరుణ్ నటిస్తున్న 13వ సినిమా ఇది.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నిఖిల్ తదితరులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మిగతా హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ కూడా పాన్ ఇండియా క్రేజ్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాడే వరణ్ – మానుషి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#VarunTej #ManushiChhillar To Star In #Telugu– #Hindi Film action drama based on #IndianAirForce. #ShaktiPratapSinghHada #OTTRelease pic.twitter.com/gsuqocVquk— OTTRelease (@ott_release) March 3, 2023
