నిత్యా.. ఎంత పని చేసింది !

నిత్యామీనన్.. ప్రత్యేకమైన హీరోయిన్. ఆమె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే రకం కాదు. స్టార్ హీరో, భారీ బడ్జెట్, భారీ రెమ్యూనరేషన్.. ఈ లెక్కలేమీ వేసుకోదు. కథ, అందులో తన పాత్ర నచ్చితే చాలు ఒకే చెబుతుంది. అందుకే నిత్యామీనన్ ఓ సినిమా ఓకే చేసిందంటే.. అందులో మేటరు ఉన్నట్టే లెక్కని ప్రేక్షకులు ఫిక్సపోతారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆమె ‘గీత గోవిందం’లో నటించింది. ఇందులో ఆమెది గెస్ట్ రోల్ నే. అయినా.. సినిమాకే అందం తీసుకొచ్చింది.

ఈ రెండేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకొన్నట్టు అడిగితే.. ‘నా జీవితంలో సినిమా ఒక భాగం మాత్రమే. సినిమా కాకుండా నా జీవితంలో చాలా ముఖ్య విషయాలున్నాయి. సంగీతం, ఫొటోగ్రఫీ, పుస్తకపఠనం.. నా అభిరుచులు. నిజానికిది ఇది విరామం కాదు, ఆ సమయాన్ని మిగతాపనులకు వినియోగిస్తున్నా. ఇకపై మాత్రం వరుస సినిమాలు చేస్తా’నని తెలిపారు.

ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానటి’ సావిత్రి బ్లాక్ బస్టర్ హిట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. ఐతే, మహానటి కోసం ముందుగా నిత్యామీనన్ అనుకొన్నారు. ఆమె సంప్రదించారు కూడా. నిత్యా కూడా సావిత్రి పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపింది. ఐతే, చివరికి ఈ సినిమా నుంచి ఆమె తప్పుకొంది. దీనికి గల కారణాలని మాత్రం నిత్యా చెప్పడం లేదు. బహుశా.. హైట్ ప్రాబ్లమ్ అయి ఉంటుందేమో.. !